Asthama, fractures etc
శ్రీ మాత్రే నమః
మొదట కోర్స్ మావారు నేర్చుకున్నారు. తరువాత అమ్మనాతో మీరూ చెయ్యండి అన్నారు నన్ను, నేను ఏమి చేయలేను అన్నాను. అమ్మగారు నువ్వే బాగా చెయ్యగలవు, నేర్చుకుంటే తప్పక నేర్చుకోవాలి అన్నారు.అమ్మ చెప్పాక బేసిక్, అడ్వాన్స్, అర్హటిక్ నేర్చుకున్నాను. అప్పటినుండి, నేను బాగా నేర్చుకుని సాధన చేస్తున్నాను. మా వారికి ఆస్థమా ఉండేది. అమ్మ ఆయనకీ హీలింగ్ చేస్తూఉంటారు. నేను ఇంట్లో కూడా చేయటం నేర్చుకున్నాను. మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంటె అమ్మగారికి చెప్తాను. నాకు చాలా ఆశ్చర్యము కలిగి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఇన్నాళ్లుమా ఆయన చాలా బాధ పడ్డా, నా పెళ్లి దగ్గరనుండి బెంగళూరు లో ఉన్నాము. అక్క్కడ BHEL ఫ్యాక్టరీ దుమ్ముకి ఆస్థమా ఎక్కువగా వస్తూ ఉండేది. రోజూ నేను ఆటో పిలిపించి ఎక్కించి ఫ్యాక్టరీకి పంపేదాన్ని. అవన్నీ తలచుకుని అన్నపూర్ణమ్మ కలిసాక ఎంతో సుఖంగా ఉన్నాము. ఇదంతా అమ్మ మహత్యము. మాస్టారుగారి మహత్యము.
నేను ఎప్పుడు ఊరికి వెళ్లినా అమ్మకు చెప్పి వెళ్తుంటాను. ఒకసారి హైద్రాబాదు వెళ్లి భోజనాల దగ్గర కుర్చీలకు చక్రాలు ఉంటాయి. ఆ కుర్చీలో కూర్చుని కింద పడ్డాను. నడుము బాగా ప్రెస్ అయింది. అలా అవ్వగానే అమ్మకు ఫోన్ చేసి చెప్పను. మీకు పర్వాలేదు, హీలింగ్ చేస్తాను అని చెప్పారు. మళ్ళి ఇంకోసారి బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పను. అక్కడ కూడా ప్లాస్టిక్ స్టూల్ పైన కూర్చుని స్నానం చేస్తుంటే అది మధ్యకు విరిగి పడింది. నేను మళ్ళీ నడుముకు దెబ్బతగిలింది, మళ్ళీ అమ్మకు ఫోన్ చేసాను. x రే తీయిస్తే మంచిది అన్నారు. ఏమి విరగలేదు, కండరము నొప్పి అన్నారు. విజయవాడ నుంచి అమ్మ నన్ను కాపాడుతూనే ఉన్నారు. లేకుంటే నేనేమి అయ్యేదాన్నో నాకే తెలియదు. ఒకరోజు కూర్చుని ఉండగా నా తలఒకటి కిటికీ కొట్టుకున్నది. చాలా భయంకరంగా ఉంది వెంటనే అమ్మకు చెప్పాను. అప్పుడుకూడా ఒక్క నిముషంలో అమ్మ నన్ను రక్షించారు. అది చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను. వెంటనే నార్మల్ అయ్యాను. ఇన్ని తెలిసికూడా నేను ఒకసారి హైదరాబాదు వెళుతూ అమ్మకు చెప్పలేదు. ఇంట్లో చుట్టాలు పనిలో ఉంది అలా చేసాను. శ్రీ శైలం గుడికి వెళ్లి గెస్ట్ హౌస్ బాత్రూం నుండి బయటకు వస్తూ వెల్లికలా పడ్డాను. ఎత్తైన గడప పైన నా నడుము, తల కింద కు తగిలి, అన్ని ఒక్క క్షణంలో జరిగిపోయాయి. అలాగే శివుని దర్శనము చేసుకున్నాను. తరువాత x ray కి వెళ్ళాము. అక్కడ ఏమి లేదు, బ్లడ్ నల్లగా ఉంది అని చెప్పారు. విజయవాడ వచ్చాక మళ్ళీఅమ్మకు చెప్తే మళ్ళీ X ray తీయించామన్నారు. దాన్లో వెన్నెముక ప్రక్కన చిన్న క్రాక్ (hair line) ఉంది అని అన్నారు. అమ్మ నాకు చెప్పకుండా వెళ్లావు, చెప్పి వెళ్లుంటే ఇంత జరిగేది కాదు అని అన్నారు. రెండు నెలల తరువాత ఆ దెబ్బ హిప్, నడుము, మీద అంతటికీ పాకి నన్ను హౌస్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు నాకు అమ్మ ఆరు నెలలనుండి హీలింగ్ చేస్తున్నారు. కాబట్టి నేను బాగానే నడుస్తున్నాను. నేను మంచాన పడకుండా అమ్మ నన్ను కాపాడుతున్నారు. అమ్మ హీలింగ్ చేయకపోతే నేను హాస్పిటల్ లో పడేదాన్ని దానికి అమ్మకు చాలా ధన్యవాదములు.
అమెరికాలో నా కొడుకు, కోడలు, మానవరాళ్లకు అమ్మ దీవెనలు చాలా ఉన్నాయి. మా కొడుకుకి కూడా ఇప్పుడు సంపాదన బాగుంది. అమ్మ దయ, దీవెనల వలన. ఒకసారి మా బాబు తలకు సోరియాసిస్ వస్తే అమ్మకు చెప్పాను. అమ్మ దయవలన అది తగ్గింది. కోడలు, మానవరాలు కూడా ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారు.
ఇప్పుడు మావారికి ఆరోగ్యము బాగోలేదు అని అమ్మ హీలింగ్ చేస్తున్నారు. అదే నాకు ధైర్యముగా ఉన్నది.
ఇదంతా ఎన్ని జన్మల అనుబంధమో కానీ అమ్మ వలన మేము అంతా అదృష్టవంతులము. అమ్మకు ఎన్నో నమస్కారాలు.
అన్నిటికంటే ఎక్కువగా కుండలిని మెడిటేషనుకు ఎక్కువగా వెళ్లేదాన్ని. మెడిటేషన్ అవ్వగానే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు చాలా కాలంగా వెళ్లలేకపోతున్నాను. వెళ్ళ్తానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాను. ఇప్పుడు అమ్మ పూజలు, శివ కళ్యాణము చేయిస్తున్నారు. అలంకారాలు చాలా దివ్యముగా ఉంటాయి. బాగా చేస్తుంటారు. అక్కడకు వెళ్ళగానే ఆరోగ్యము బాగుంటుంది. ఇంటిదగ్గర కాళ్ళు నొప్పులు, వెళ్ళలేను అనుకుంటాను. ఎలాగైనా వెళ్తే, వెళ్ళగానే ఏ నొప్పి ఉండదు. ఇదంతా అమ్మ శక్తీ. అమ్మకు బాగా తెలుసు, అమ్మకు ఆ శక్తీ ఉంది. ఇదంతా వారిదీవెనలు, అమ్మ దీవెనలు. అమ్మ మీకెన్నో నమస్కారములు. ఎంత చెప్పినా సరిపోవు.
