CMA Inter
శ్రీ మాత్రే నమః
అప్పుడు నేను CMA-inter 2ను టైం కోచింగ్ కి వెళ్తున్నాను. వేరే వాళ్ళు కోర్స్ గురించి చెపుతుంటే దాని గురించి నాకు కూడా చెప్పమని అడిగాను. అప్పుడు వారు నాకు వివరించి ఇక్కడకు వచ్చిన తరువాత నువ్వు ఖచ్చితంగా CA INTER పాస్ అవుతావు అన్నారు.
నేను నవంబర్ 1,2 2014 తేదీలలో క్లాస్ చేయటం జరిగింది. ఆ క్లాస్ కోసం నేను అమ్మ దగ్గరకు వచ్చాను. వచ్చిన మొదటిరోజే అమ్మను పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగించాను. అమ్మ మాత్రం చాలా ఓపికతో సమాధానం చెప్పారు.
వాటిల్లో ఒక ప్రశ్న. అమ్మ మీరు దేవుడిని నమ్ముతారా? నేను ఐథెయ్ దేవుడిని నమ్మను, దేవుడిని చూపిస్తే నమ్ముతాను అని నేను అడిగాను. అప్పుడు అమ్మ నువ్వు చదువుకున్నావు కదా కరెంటు గురించి తెలుసు కదా, దాన్ని నాకు చూపించు అని అడిగారు. చూపించలేము కదా ఎలా కుదురుతుంది అన్నాను. అప్పుడు అమ్మ మరి దేవుడు కూడా అంతే ఇక్కడ శక్తీ ఉన్నాయి నీవు కూడా ఫీల్ తో తెలుసుకోవాలి అన్నారు. నాకు అది ఆరోజు అర్ధం కాలేదు కానీ తర్వాత మాత్రం అర్ధం అయింది
నేను అమ్మ దగ్గరకు ఎందుకు వచ్చానో చెప్పలేదు కదూ నా పరీక్ష విషయం గా అమ్మ దగ్గరకు వచ్చాను. అప్పటికి ఒకసారి CMA INTER లో ఫెయిల్ అయ్యాను. మరొకసారి భయపడి పరీక్షలే రాయలేదు. అటువంటి సమయంలో రెండవసారి కోచింగ్ కి వెళుతూ వచ్చాను. అమ్మ నేను ఒక మంత్రం చెప్తాను, దాన్ని చదువు అన్నారు. అమ్మ చెప్పినట్టు చేసాను. పరీక్షలకు అప్పుడు కేవలం నెల రోజులు ఉన్నాయి. అమ్మ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీస్కుని వెళ్ళాను. అప్ప్పుడు 300 మంది రాస్తే కేవలం నలుగురు పాస్ అయ్యారు. వారిలో నేనూ ఒకడిని. అప్పటి నుంచి అమ్మపై నాకు నమ్మకం కుదిరింది.
బేసిక్ క్లాస్ అప్పుడే అమ్మకు నా పరిస్థితి మొత్తం చెప్పాను. నేను డిప్రెషన్ కు లోనయ్యాను. అక్కనుంచి సైకాలాజిస్టు దగ్గరకు వెళ్తే వారు మాటల్తో సరిపెట్టారు. వాటి వాళ్ళ ఉపయోగం లేదు అనిపించింది. అమ్మ దగ్గరకు వచ్చి రెండు రోజులు కూర్చుంటే మొత్తం సెట్ అయ్యి CMA INTER పాస్ అయ్యాను.
2018 ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి రోజూ అమ్మతో గడిపాను. ఆ సమయంలో అమ్మ నాకు చాలా management లెసన్స్ నేర్పించారు.అక్కడ జరిగిన ప్రతి అద్భుతానికి నేను ప్రత్యక్ష సాక్షినే 2019 జనవరి లో CMA ఫైనల్ కోచింగ్ కోసం దూరం గా వచ్చాను కానీ అమ్మ దగ్గరకు వెళ్లే ప్రతిసారీ అమ్మ పలకరించే విధానం మాత్రం అలాగే ఉంది.
