Chronic Fever
శ్రీ మాత్రే నమః
అమ్మకు పాదాభివందనములతో, నేను అమ్మతో నాకు ఉన్న ఒక చిన్న అనుభవం మీ అందరితో పంచుకోవటం, నేను ఒక వరంగా భావిస్తున్నాను.
ఆరు సంవత్సరాలకు ముందు నాకు కోర్స్ టీచింగ్ ద్వారా అమ్మ నాకు పరిచయం అయ్యారు. నేను చాలా సమస్యలతో నాలో నేను బాధపడుతున్నప్పుడు అమ్మ నాకు చాలా విషయాలు నేర్పారు. ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుంది అని చెప్పారు. అప్పటి నుండి ఎలాంటి సమస్య వచ్చినా అమ్మ నాకు సహాయంగా ఉండేవారు. ఈ మధ్యనే మా ఫామిలీ ఫ్రెండ్ కూతురు మూడునెలల నుండి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నది. ఏ హాస్పిటలుకు తీసుకుని వెళ్ళినా ప్రయోజనం లేదు. అప్పుడు అమ్మ మా సమస్యకు పరిష్కారం చూపి జ్వరాన్ని తగ్గించారు. నాకు ఇంత మేలు చేసిన అమ్మకు జీవితం అంతా ఋణపడి ఉంటాను.
