Blessed with girl

శ్రీ మాత్రే నమః

మా దంపతులము పూజ్యగురువులైన అన్నపూర్ణమ్మగారి ఆశీస్సులతో మేము మా కుటుంబం ఇప్పటికి, ఎప్పటికీ  పొందే మా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవటానికి కలిగిన ఈ అవకాశానికి ఎంతో రుణపడి ఉన్నాము. మా దంపతులకు వివాహము జరిగి 12 సంవత్సరములు అయినప్పటికీ మాకు సంతానం కలగలేదు. ఎక్కని మెట్టులేదు, మొక్కని దేవుడు లేదు. అటువంటి సమయంలో మా గురువుగారైన అన్నపూర్ణగారి ఆశీసులతో, వారి హీలింగ్ మహత్యంతో 15-6-2013 న మాకొక బంగారంలాంటి ఆడపిల్ల పుట్టింది. అమ్మ మా ఇంటికి వచ్చి వారి దీవెనలు మా పాపకు, కుంబానికి అందించారు. సహజంగా అందరూ వారి పెద్దలపేర్లు వచ్చేలాగా పిల్లల పేర్లు పెడతారు. మేము అమ్మ కృతజ్ఞతతో వారి పేరు వచ్చేలా పాపకి చెంచు వెంకటసుబ్బు సాయి లలితపూర్ణ అని నామకరణం చేసాము.

మేము మా ఇంట్లో ఏ శుభకార్యం చేయాలనుకున్నా అమ్మ ఆశీస్సులతోనే మొదలుపెడతాము. మా పాప మోక్షిత అక్షరాభ్యాసము అమ్మ చేతులమీదుగా విజయవాడ లో జరిగింది. అమ్మ అనుగ్రహం వలన పాప ప్రతిరంగంలో అద్భుతంగా రాణిస్తోంది. ఈ రోజు మేము ఇంత సంతోషంగా ఉండటానికి కారణం అమ్మ దీవెనలు. ఇంత కరుణతో దయతో చూసే ఆ తల్లి, ఆమె కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం వుండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాము.

Similar Posts

  • CMA Inter

    ​​శ్రీ మాత్రే నమః  అప్పుడు నేను CMA-inter 2ను టైం కోచింగ్ కి వెళ్తున్నాను. వేరే వాళ్ళు కోర్స్ గురించి చెపుతుంటే దాని గురించి నాకు కూడా చెప్పమని అడిగాను. అప్పుడు వారు నాకు వివరించి ఇక్కడకు వచ్చిన తరువాత నువ్వు ఖచ్చితంగా CA INTER పాస్ అవుతావు అన్నారు.  నేను నవంబర్ 1,2 2014 తేదీలలో క్లాస్ చేయటం జరిగింది. ఆ క్లాస్ కోసం నేను అమ్మ దగ్గరకు వచ్చాను. వచ్చిన మొదటిరోజే అమ్మను పిచ్చి…

  • From Australia

    శ్రీ మాత్రే నమః ​​ ​నమస్తే, మీరు అందరూ ఎలా ఉన్నారు. మీరు అందరూ మంచిగ, బాగున్నారు అని ఆశిస్తున్నాను. అన్నపూర్ణ అమ్మను కలవటం నా జీవితంలో జరిగిన ఒక అత్యుత్తమమైన విషయం. ఎవరూ నన్ను నమ్మరు, కానీ నేను అమ్మను కలుసుకునే ముందు 2012 లో నా కలలో అన్నపూర్ణమ్మను చూసాను. నేను 3వసారి సాయి బాబా పారాయణం చేసే సమయంలో నా కలలో అన్నపూర్ణ అమ్మను చూశాను. నేను నవంబర్లో 2012 లో అన్నపూర్ణమ్మను కలిశాను. ఆ తరువాత ప్రతిరోజు…

  • Life Lessons

    శ్రీ మాత్రే నమః ఆత్మ నమస్తే, అన్నపూర్ణ అమ్మ గురించి చెప్పటానికి మాటలు చాలవు, అక్కతో నాకు ఉన్న అనుభవాలు గురించి చెప్తే ఒక పుస్తకం చాలదు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మీతో పంచుకుంటాను. అక్కతో నా జీవితంలోని అనుభవాలు 1. అమ్మ లాగా లాలించారు. 2. నాన్న లాగా అవసరం ఉన్నప్పుడు దండించారు.3. అక్క లాగా బాధలను పంచుకున్నారు .4. గురువుగా నడిచే మార్గాన్ని చూపించారు. నా వరకు ఇవి అన్ని కలిపి అక్క నాకు…

  • Life changing

    శ్రీ గం గం గం గణపతియే నమః“ఓం శ్రీ గురుబ్రహ్మ, గురు విష్ణుః, గురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురు అన్నపూర్ణనే నమః” “ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామకామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతిశ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతివాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి” మనిషి తన జీవితంలో చేసిన పుణ్య కర్మ వలన భగవంతుడు ఒక మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాడు. బహుశా నా జీవితంలో ఒక అద్భుతమైన వరం నాకు ప్రసాదించాడు. అదే అమ్మ “అన్నపూర్ణమ్మ” నాకు…

  • Cancer and others

    శ్రీ మాత్రే నమః  “అను” గానే పరిచయం అయినా అన్నపూర్ణమ్మను భౌతికబంధాల చేత “అను” గా అన్వయించుకుంటానేమో కానీ తాను రూపుదాల్చిన ఊహ తానే అమ్మ.  మొట్టమొదటిరోజు అన్నపూర్ణమ్మ మా జీవితాల్లోకి అడుగు పెట్టిన రోజు నాకింకా ఫ్రెష్ గా నా హృదయఫలకము మీదనే ఉంది, చెప్పాలి అంటే అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆ రోజు నేను అనురాధను వదిలి గుడికెళ్ళి వచ్చేసరికి అమ్మమొహంలో, కళ్ళల్లో ఎదో వింతవెలుగు  ఉత్సాహంగా కనిపిచింది. – ఏంట్రా విశేషం అంటే  మొదటగా…

  • Asthama, fractures etc

    ​​శ్రీ మాత్రే నమః  మొదట కోర్స్ మావారు నేర్చుకున్నారు. తరువాత అమ్మనాతో మీరూ చెయ్యండి అన్నారు నన్ను, నేను ఏమి చేయలేను అన్నాను. అమ్మగారు నువ్వే బాగా చెయ్యగలవు, నేర్చుకుంటే తప్పక నేర్చుకోవాలి అన్నారు.అమ్మ చెప్పాక బేసిక్, అడ్వాన్స్, అర్హటిక్ నేర్చుకున్నాను. అప్పటినుండి, నేను బాగా నేర్చుకుని సాధన చేస్తున్నాను. మా వారికి ఆస్థమా ఉండేది. అమ్మ ఆయనకీ హీలింగ్ చేస్తూఉంటారు. నేను ఇంట్లో కూడా చేయటం నేర్చుకున్నాను. మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంటె అమ్మగారికి చెప్తాను….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *