Life changing
శ్రీ గం గం గం గణపతియే నమః
“ఓం శ్రీ గురుబ్రహ్మ, గురు విష్ణుః, గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురు అన్నపూర్ణనే నమః”
“ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి”
మనిషి తన జీవితంలో చేసిన పుణ్య కర్మ వలన భగవంతుడు ఒక మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాడు. బహుశా నా జీవితంలో ఒక అద్భుతమైన వరం నాకు ప్రసాదించాడు. అదే అమ్మ “అన్నపూర్ణమ్మ” నాకు గురువుగా లభించడం. ఎంతో పుణ్యం చేస్తే కాని నాకు అమ్మ లాంటి గురువు లభించడం కష్టం. భగవంతుడు నాకు అలాంటి గురువును ప్రసాదించాడు. అలాంటి అమ్మ గురించి నా జీవితంలో జరిగిన అద్భుతాల గురించి వ్రాయడం ఒక వరం.
అమ్మతో నా ప్రయాణం 2013 వ సం॥ నుండి మొదలు పెట్టాను. అదే నా జీవితంలో గొప్ప అడుగు వెయ్యడం. అమ్మతో ఆనాటి నుండి ఈ నాటి వరకు నాకు అన్నీ అద్భుతాలే, బహుశా అమ్మే లేకుంటే నేను ఈ భూమి మీద వుండే వాడిని కాదేమో! అలాంటి అద్భుతాలలో కొన్ని వ్రాస్తున్నాను.
- 2013వ సం॥లో నేను నా ప్లాట్ అమ్మడానికి నేను చాలా కష్ట పడ్డాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. వాస్తు బాగోలేదని అందరూ వెనుదిరిగారు. అప్పుడు నా సమస్యను అమ్మతో విన్నవించుకున్నాను. విన్నవించుకున్న 48 గం॥లలో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. ప్లాట్ చూసుకొని వెంటనే ప్లాట్ కొనేసారు. అద్భుతం అనిపించింది, కాదు ఇది ఖచ్చితంగా అమ్మచేసిన అద్భుతమే..
- ప్రతీ రోజు కొంత మందికి ఎంతో కొంత సహాయం చేయాలనుకునే వాడిని, కానీ ఎప్పుడూ చెయ్యలేక పోయేవాడిని, అపుడు అమ్మ నీ వృత్తి ద్వారా పదిమందికి సహాయం చెయ్యి అని చెప్పడంతో అమ్మ కరుణతో కంటి పరీక్షా క్యాంపులు చెయ్యడం మొదలు పెట్టాను, అది కూడా అమ్మ చల్లని చూపుతో. ఈ రోజుకి మెడికల్ క్యాంప్ ద్వారా 150కి పైగా కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించగలిగాను, ప్రతిది అమ్మ ఆశీర్వాదంతోనే. నేను చేసిన ప్రతి సేవలోనూ అమ్మ నన్ను ముందుండి నడిపించారు. ఇలా అమ్మ నాతో ఎన్నో చేయించారు. అది నా వరం.
- అమ్మ చెప్పిన ప్రతీ మాట నా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. నా చుట్టూ వున్న సమస్యల నుండి ఎలా బయటపడాలో అమ్మే నాకు నేర్పించారు. ఇప్పటికీ అమ్మే నన్ను కాపాడుతూ వస్తుంది.
- నేను ఇప్పుడు బ్రతికి వున్నాను అంటే దానికి ముమ్మాటికీ అమ్మే కారణం.
