Life Lessons
శ్రీ మాత్రే నమః
ఆత్మ నమస్తే, అన్నపూర్ణ అమ్మ గురించి చెప్పటానికి మాటలు చాలవు, అక్కతో నాకు ఉన్న అనుభవాలు గురించి చెప్తే ఒక పుస్తకం చాలదు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మీతో పంచుకుంటాను.
అక్కతో నా జీవితంలోని అనుభవాలు
1. అమ్మ లాగా లాలించారు.
2. నాన్న లాగా అవసరం ఉన్నప్పుడు దండించారు.
3. అక్క లాగా బాధలను పంచుకున్నారు .
4. గురువుగా నడిచే మార్గాన్ని చూపించారు.
నా వరకు ఇవి అన్ని కలిపి అక్క నాకు దొరికిన వరం. నా జీవితం లో ఒక అద్భుత అనుభవం “అక్క”. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది నేను అక్క దగ్గర నేర్చుకున్నాను.
అక్క నాకు నేర్పిన విషయాలు
తప్పు చేయవద్దు, తల వంచవద్దు.
ఎదుటి వారిని గౌరవించు. అహం మాటల్లో కానీ, చేతల్లో కాన్ని చూపించవద్దు.
బాధ పెట్టినా భరించు కానీ నీ ముక్కును ముట్టుకుని బాధపెడితే ఖచ్చితమైన సమాధానం చెప్పు.
నా జీవితం ఎన్నోసార్లు అక్క సహాయంతో ముందుకు నడిచింది. ఇప్పటికి నడిచే దారిని చూపిస్తూనే ఉన్నారు.
అక్కతో అనుభవాలు చెప్పాలి అంటే సాయిబాబా జీవిత చరిత్ర లాంటిదే. సెంటర్ ప్రారంభించటం, అందులో ఎన్నో కష్ట నష్టాలు, దాన్ని నిలబెట్టటానికి అక్క చేసిన ఎన్నో ప్రయత్నాలు, పక్కనే ఉండి, చూసి వాటి నుండి నేర్చుకున్నాను. సెంటర్ అద్దె దగ్గర నుండి, క్లాసులు జరిగినప్పుడు అక్క తన ఎంతో సమయం వెచ్చించారు.. ఆ సమయంలో వారు పడిన మానసిక వేదన వర్ణించడం కూడా కష్టం.
సాయి బాబా తన భక్తులకు కొన్ని తీస్కుని కొన్ని ఇచ్చి వారి సమస్యలు తీర్చేవారు. అదే విధంగా అక్కతో నా అనుభవాలు నా పెళ్ళి సమయంలో అక్క తాను వాడిన చెప్పులు ఇచ్చారు, అవి నన్ను నాకు నచ్చిన దారిలో నడిచేలాగా చేశాయి.
నా ప్రసవసమయం నాకు ఒక మరపురాని జ్ఞాపకం. ఆ సమయంలో నా చేతికి అక్క ఇచ్చిన గాజులు ఉన్నాయి. డాక్టర్ నొప్పులు వస్తన్నాయి, గాజులు తీయమన్నది. కానీ నేను వాటివలన నాకు మంచి జరుగుతుంది, తీయను అన్నాను. అప్పుడు నా నోటినుండి వచ్చిన పదం రామ, మానసుఁలో నిలిచినా రూపం అక్క. చివరకు ప్రసవం ప్రశాంతంగా అయింది. చాలా కొంచెం సమయంలో నొప్పలు తెలియకుండా అక్క చెప్పన చండి ప్రియ పుట్టింది.
నా కూతురి విషయంలో ఎన్నో అద్భుతాలు అక్క ద్వారా జరిగాయి.
నా జీవితంలో ఒక కష్టం నన్ను చాలా బాధ పెట్టింది. కొంత మందికి నేను చేసిన మంచికి ప్రతిఫలంగా నాకు కష్టాలు కలిగేలా చేశారు. ఆ కష్టంలో అక్క నాకు ఒకమాట చెప్పారు దాన్ని జీవితం లో మరచిపోలేను.
“నేను మంచి చేసాను, వారు నాకు చెడు చేశారు అనుకోకు; అది నీ ద్వారా ఆ భగవంతుడు వారికి చేయించారు, వాళ్ళు నిన్ను బాధపెట్టారు అనేది వారి విజ్ఞతకు వదిలిపెట్టు. సమయం అన్నింటికీ సమాధానం చెప్తుంది.” అలా నన్ను ఆ బాధ నుండి బయటపడేలా చేశారు.
అక్క నా జీవితం ఒక్కటే కాదు, మా కుటుంబంలో ఎన్నో జీవితాలు నిలబెట్టారు. కొంత మందికి ప్రాణం పోశారు, కొంత మందికి బిడ్డలను ప్రసాదించారు.
అక్క ఎప్పుడూ చెప్పే మాట. “నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు కష్టసుఖలాలు వస్తాయి, వెళ్తాయి; నీ సాధనని వదలకు, ముందుకు నడువు”
అక్కను మా జీవితాలలోకి తెచ్చిన ఆ భగవంతునికి, గురువులకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు.
