Cancer and others
శ్రీ మాత్రే నమః
“అను” గానే పరిచయం అయినా అన్నపూర్ణమ్మను భౌతికబంధాల చేత “అను” గా అన్వయించుకుంటానేమో కానీ తాను రూపుదాల్చిన ఊహ తానే అమ్మ.
మొట్టమొదటిరోజు అన్నపూర్ణమ్మ మా జీవితాల్లోకి అడుగు పెట్టిన రోజు నాకింకా ఫ్రెష్ గా నా హృదయఫలకము మీదనే ఉంది, చెప్పాలి అంటే అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆ రోజు నేను అనురాధను వదిలి గుడికెళ్ళి వచ్చేసరికి అమ్మమొహంలో, కళ్ళల్లో ఎదో వింతవెలుగు ఉత్సాహంగా కనిపిచింది. – ఏంట్రా విశేషం అంటే
మొదటగా అన్నపూర్ణమ్మని వర్ణించింది ఆర్టిస్ట్ అవ్వటం వలన బాగా అనుభూతిలోకి నింపింది. పెద్దబొట్టు,సూటిగా ఉండే ముక్కు, ప్రేమతో నిండిన కళ్ళు, కట్టు బొట్టు అంటే ఊహాచిత్రం గీసి చూపించింది. సరిగ్గా తనని నేను చూసినప్పటికీ అలాగే ఉన్నారు. అన్నపూర్ణమ్మ అంతలా హృదయంలో ఇమిడిపోయే రూపం తనది.
వెలుగుకి, ఉత్సాహానికి కారణం అనురాధ నొప్పితగ్గటం. ఏ మందులకు తగ్గని ఆ నొప్పి , ఏ డాక్టరూ ఇంకా ఏమి చేయలేము అని నిస్సహాయపు నిర్ధారణ చేసి ఇంకా నేలకూడా తాను బ్రతకాదంటూ [బ్రెస్ట్ కాన్సర్ చివరి స్టేజిలో మహా అయి అయితే నెలా, నెలన్నర అన్న డాక్టర్లను విస్మయపరుస్తూ ఒకటిన్నర సంవత్సరాలు మాకు అనురాధను ఇచ్చిన అన్నపూర్ణమ్మ ప్రవేశం దాదాపు దైవదూత, ఆ తరువాత దేవత గా నిలిచారు.
ఏ అర్ధరాత్రో సుడులు తిరిగే నొప్పితో మెలికలు తిరిగే అనురాధ దేవుడు సగంలో ఆపేసిన చిరుకవిత, ఒక ఆర్టిస్ట్, ఒక సింగర్, వీణ అన్నిటికీ మించి అల్లరి మహా అల్లరి. అలా చూడలేక అన్నపూర్ణమ్మకి ఫోను చేసేదాన్ని ఫోను అలాగే పట్టుకో అంటూ హీలింగ్ చేసాక హాయిగా నిద్రపోతున్న అనురాధను చూస్తే కొండంత ఆనందం. హీలింగ్ చేస్తున్న అమ్మ అంటే అణువణువునా ఆరాధనాభావము.
తాను వచ్చి వెళ్ళాక నేను కాల్ చేసాను. మీరు అన్నపూర్ణగారు కదా, మీరు డాక్టరా, హీలరా మరిఏంటి? తనలో ఇంతలో మార్పులేంతికి?? అనురాధ బోన్ కాన్సర్ చివరి స్టేజిలో ఉందని మీకు తెలుసా? ఎం జరిగింది, తాను సాయంత్రం లేచి కూర్చుంది,… వంటింట్లోకి లేచి వచ్చేసింది అన్ని.. అడిగాను. నేను హీలరును అని చెప్పి ఆమె స్టేజి నాకు తెలియదు కానీ కనెక్ట్ అయ్యి హీలింగ్ చేసాను అని చెప్పారు.
ఆ తరువాత అనురాధ కేసు పత్రాలతో చిలకలూరిపేట డాక్టరు గారి దగ్గరకు నన్ను పంపారు. అది చూసి డాక్టరు, ఏమి చేయలేము అన్నారు. ఆ తరువాత తిరుపతిలో జరిగిన క్లాస్ తర్వాత డాక్టర్స్ టీంతో మాట్లాడిన తరువాత తనది అంతా అయిపోయిన పరిస్థితి కేసు నువ్వు తీసుకుంటే నీకు ప్రమాదం అన్నారు. [వెన్నెముక 1/4 అటాచ్మెంట్ వున్న మనిషిని లేపి నడిపించించారు అంటే, అది మనుషులకు సాధ్యమా??]
ప్హీలింగుకు ఒక సవాలు అని కలర్ ప్రాణ ఉపయోగిస్తే మనం తనని హీలింగ్ చెయ్యొచ్చా అని చెప్పారంట. వారందరూ వారించినా వినకుండా నాకు గురువు సహాయం చేస్తారు అంటూ హీలింగ్ మొదలు పెట్టారు. అవి తనకి చాలా కష్టమైన రోజులు. కానీ అనురాధ చనిపోయేవరకు ఆశ మాత్రం ఉండేది. అన్నపూర్ణమ్మ కొంత కర్మను కూడా తీసుకున్నారు, ఆ తరువాతే అమ్మ ముఖం పై మచ్చలు, కొన్ని ఎఫెక్ట్స్ తెలిసాయి.
ప్రతిసారీ నొప్పి ఎక్కువగా ఉన్నపుడు అమ్మ మాకు సహాయం చేసారు. చివరగా అన్నపూర్ణమ్మ కూడా చెప్పారు, వెంటిలేటర్ పైన ఉంటే (రమ్మని అడిగితే )ఏమి జరిగిందో అమ్మ తన నుదుటిపై బొట్టు పెట్టారు,.. తన జీవితం మరో పదిహేనురోజులు పెరిగింది. కానీ విడవని విశ్వాసం తనలో మాములుగా అవుతాను అని.తానూ క్లాసులు చేస్తాను, హీల్ చేస్తాను అని చెప్పేది. ఒకసారి విజయవాడ క్లాసుకి బ్లెస్సింగ్స్ కురమ్మన్నారు. కానీ లేవలేని స్టేజి లో ఉన్న తనకి హీలింగ్ చేసి కారు లో గుంటూరు నుంచి రప్పించి క్లాస్ లో కూర్చుబెట్టారు. ఇలా చెబుతుంటే ఎన్ని మధురక్షణాలు మాకు అమ్మ ఇచ్చారు అని.
అన్నపూర్ణమ్మ మా జీవితాల్లోకి వచ్చాక అమ్మ నేను ఇలా ఉండాలి అని ఏ రోజూ దిగులు పడలేదు. ఆ రోజులన్నీ ఆహ్లాదంగా, ఆనందంగా, ఒక పండగలా సాగాయి. అమ్మ మేము మీకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాము. మీవల్లనే కదా మేము ఇన్ని ఉషోదయాలు, సంధ్యాసమయాలు, లతామంగేష్కర్ గాన కచేరీలు, చివరికి కూర్చొని వీణ కూడా వాయించిన క్షణాలు ఇవన్నీ అన్నపూర్ణమ్మ చలువే కదా. కళ్ళనిండా నీళ్లతో, ఆర్తితో నీకు అభినందనలు. ఇది అన్నపూర్ణమ్మ మొదట్లో మా జీవితాల్లోకి వచ్చి ఉంటె, అనురాధ ఇప్పటికీ మీ ముందర మరో హీలరుగా ఉండి అందరికీ స్ఫూర్తి అయ్యేది. ఒకసారి మేడం క్లాసు తిరుపతిలో జరిగింది. అప్పుడు ఈ అనురాధ మరిది మరణశయ్య పైన వున్నాడు. వాళ్ళ ఆవిడ మంగళసూత్రమును తన రెండు అమ్మ తన రెండు అరచేతుల్లోకి తీసుకుని గట్టిగా మూసారు. అంతే ఆ అబ్బాయి ఇప్పటికీ ఉన్నాడు. నాకు నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అంటే రూపు దాల్చిన అన్నపూర్ణమ్మను అందరూ దేవత అంటారు. నాకు అనిపిస్తుంది అయినా చెప్పానుగా నా అనురాగాల పాలవెల్లి అనుకుంటా కానీ అయినా దేవతే అని.
ఒకసారి బావగారు (అక్క మొగుడు) గుండె కు ఆపరేషన్ అని తీసుకువెళ్లారు. ఆపరేషన్ టైం లో ఆపరేషన్ బెడ్ పై మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ అన్నపూర్ణమ్మ బిక్ష బావగారు. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంటాయి. ఒక అద్బుతమైన భూమిపై తిరిగే దేవత హీలింగ్ లోకి రావటం ఆ విద్యకు అంతులేని క్రెడిట్ అని నా భావం.
మా పిల్ల 19 ఏళ్ల కొడుకుండగా కలవరపడుతుంటే తన దగ్గరకు తీసుకువెళ్తే మరో అమ్మాయి పుడుతుంది, తన గజ్జలతో తిరుగుతున్న శబ్దం నాకు విన్పిస్తుంది అంటే.
ఆల్రెడీ ఆపరేషను చేయించుకున్నాను ఆయన కష్టమే కానీ నా వాళ్ళ కాదని నవ్వేసి వెళ్ళాక, ఇంగ్లండ్లో ఉన్న వీళ్ళకి ఇప్పుడో ఐదేండ్ల అల్లరి పిల్ల
అన్నపూర్ణమ్మ అలుపెరుగని, అంతేలేని అనురాగరంజితమైన వెన్నెలంటి హృదయపు అమృతపూర్ణ బింబాల్ని అపర్ణ అలసి సొలసిన హృదయాలకు సదా మాలో ఉండాలని కోరుకుంటూ…
